ఎమ్మెల్యేలను కొని.. నేను అవుతా సీఎం..!

231
- Advertisement -

బాహుబలి సినిమాతో భల్లాదదేవుడిగా తనదైన విలనిజాన్ని చూపించి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా చేస్తున్న కమర్షియల్ ఎంటర్‌ టైనర్ నేనే రాజు నేనే మంత్రి. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ ను మూవీ మొగల్ రామానాయుడు జయంతి సందర్శంగా రిలీజ్ చేశారు. రానా రాజకీయనాయకుడు జోగేంద్రగా కనిపించనున్నాడు.తాజాగా నేనే రాజు నేనే మంత్రి చిత్ర ట్రైలర్ విడుదల చేసి మూవీపై మరిన్ని అంచనాలు పెంచారు మేకర్స్.

ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు, రానా చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. ఇక చివరిలో పాముకి పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి అని రానా చెప్పిన డైలాగ్ అదరహో అని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, వీలైనంత త్వరగా మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ చితం పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందినట్టు తెలుస్తుండగా, ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

- Advertisement -