- Advertisement -
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో భాగంగా మూడోవారంలో ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు నేహా చౌదరి. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేహా.
హౌస్ లో తనను నమ్మినవాళ్లే ఇలా చేశారు. ముఖ్యంగా రేవంత్ వల్లే నేను బయటకి వచ్చేశాను. నేను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదన్నారు. చాలా షాకింగ్ కి గురయ్యాను ఎలిమినేట్ అయ్యాను అని తెలిసిన తర్వాత. అసలు నేను ఎందుకు బయటికి వచ్చానో నాకే తెలీదు, నాకంటే అసలు గేమ్ ఆడని వాళ్లు కూడా ఇంకా హౌస్‌లో ఉన్నారని చెప్పారు.
ఒకవేళ మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లే ఛాన్స్ వస్తే కచ్చితంగా వెళ్తాను. అసలే హౌస్ రివేంజ్ తీసుకోవాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు అని రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది నేహా.
- Advertisement -