నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా.. !

16
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీది కూడా మానసిక రుగ్మతలకు కారణం అవుతోంది. ఈ మానసిక రుగ్మతల కారణంగా డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఆవహిస్తుంటాయి. వీటి వల్ల నెగిటివ్ ఆలోచనలు ఏర్పడి మనకి మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాము. ఏదైనా లక్ష్య సాధనలో పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం. ఎందుకంటే చేసే పనిలో సానుకూల దృక్పధం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే మోటివేషన్ అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తుంటారు. అయితే అన్నీ వేళల మోటివేసఃన్ చేసే వ్యక్తి పక్కన ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఎంతో ముఖ్యం..

నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడూ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడంలో విఫలం అవుతుంటారు చాలమంది. ఫలితంగా తీవ్ర డిప్రెషన్ కు లోనై లక్ష్య ఛేదనలో వెనకబడిపోతారు. అందుకే నెగిటివ్ థింకింగ్ ను విడిచిపెట్టడం చాలా అవసరం. పదే పదే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని అధిగమించడానికి నచ్చిన పని చేయడం మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఉదాహరణకు ఏదైనా పని చేసేటప్పుడు నెగిటివ్ థింకింగ్ వస్తే.. ఆ సమయంలో నచ్చిన మ్యూజిక్ వినడం లేదా బుక్స్ చదవడం వంటి ఇష్టమైన పనులు చేయాలట.

ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ గా మారి రీఫ్రెష్ గా మారిపోవచ్చని నిపుణులు చెబుతున్న మాట. ఇంకా నెగిటివ్ ఆలోచనలు పదే పదే వేధిస్తున్నప్పుడు పాజిటివ్ గా మాట్లాడే స్నేహితులతో టైమ్ గడపాలి. ఇలా చేయడం వల్ల మనోదైర్యం లభిస్తుంది. తద్వారా నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు. ఇంకా వీటి నుంచి బయటపడేందుకు జీవన శైలిలో కూడా మార్పులు అవసరమని చెబుతున్నారు నిపుణులు. ప్రతిరోజూ ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం వంటివి అలవాటు చేసుకుంటే మానసిక ఉల్లాసం లభిస్తుంది. తద్వారా రోజంతా పాజిటివ్ థింకింగ్ తో ఉండొచ్చని మానసిక నిపుణులు చెబుతున్న మాట.

Also Read:Jagan:టార్గెట్ లోకేష్..జగన్ ప్లాన్ అదే?

- Advertisement -