NEET 2025: నీట్‌ పీజీ పరీక్ష తేదీ ఖరారు

6
- Advertisement -

నీట్‌ పీజీ పరీక్ష తేదీ ఖరారు అయింది. ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఆగస్టు 3న నిర్వహించేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి జూన్ 15న నిర్వహించేందుకు నిర్ణయించగా వాయిదా పడింది.

పరీక్షను రెండు షిఫ్ట్‌లలో కాకుండా ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో పరీక్ష తేదీలో మార్పుకు అవకాశం కల్పించారు. నీట్ పీజీ పరీక్ష విధానం గురించి ఇటీవల సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా,పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించడాన్ని ధర్మాసనం తిరస్కరించింది.

ప్రతి మార్కు పోటీలో కీలకంగా మారుతున్న నేపథ్యంలో,పారదర్శకత కోసం పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షకు ఇంకా రెండువారాలకు పైగా సమయం ఉందని గుర్తుచేస్తూ, తగిన కేంద్రాలను ఎంచుకోవడానికి ఇది సరిపోతుందని పేర్కొంది.

Also Read:అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్..ఉత్తమ్

- Advertisement -