Neeraj Chopra: వరల్డ్‌ ఛాంపియన్‌గా నీరజ్‌

46
- Advertisement -

ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో పసిడి పతకాన్ని గెలిచాడు నీరజ్ చోప్రా. ఈ పతకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. తొలి రౌండ్‌లో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా రెండో రౌండ్‌లో 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. 3వ సారి నీరజ్ చోప్రా 86.32 మీటర్ల దూరం విసరగా, పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు తిప్పి 2వ స్థానానికి చేరుకున్నాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 4వ రౌండ్‌లో నదీమ్ 87.15 మీటర్లు విసిరగా, చోప్రా 84.64 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని గెలిచాడు.

2022 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న నీరజ్….ఈసారి బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించాడు.

Also Read:సి‌ఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చేనా ?

- Advertisement -