న్యాయం కోసం వీధుల్లో రెజ్లర్లు ధర్నా చేయడం తన గుండెను కలిచివేస్తున్నట్లు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన నీరజ్..అథ్లెట్లకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
దేశ తరపున పోటీ పడేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని, ప్రతి ఒక్క పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇక ఎప్పుడూ జరగకూడదని, ఇది చాలా సున్నితమైన అంశమని, చాలా పారదర్శకంగా ఈ సమస్యను పరిష్కరించాలని ట్వీట్‌లో కోరారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా అథ్లెట్లతో బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023
Also Read:IPL 2023:లక్నో తో పంజాబ్.. గెలిచేదెవ్వరు?