నీరా కేంద్రంను ప్రారంభించిన మంత్రులు

47
- Advertisement -

తెలంగాణ సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ కులస్థుల ఆర్థిక సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నగరం నడిబొడ్డున కల్లుగీత కార్మికులు తయారుచేసే నీరా కేంద్రంను నెక్లెస్‌ రోడ్డులో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేసీఆర కేటీఆర్ చిత్రపటాలకు నీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రిశ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ కృషి అమోఘమని కొనియాడారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల కోసం రూ.5లక్షల బీమాను కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైన దాదాపు లక్ష మంది గీత కార్మికులకు ప్రతి నెల రూ. 2016 ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. మ‌ద్యం దుకాణం కేటాయింపుల్లో గౌడ సామాజిక వ‌ర్గానికి 15 శాతం, ఎస్సీ, ఎస్టీల‌కు 15 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం సాహోసోపేత‌మైన నిర్ణ‌యం అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Also Read: NEWDELHI:రేపే బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం

రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టామ‌ని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియాను రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచడం జరిగింద‌ని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అలాగే, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి గతంలో ఇచ్చిన రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని రూ. 5 లక్షలకు పెంచ‌డం జరిగిందన్నారు.

Also Read: కేసీఆర్ రియల్ హీరో..వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

- Advertisement -