Neenagupta:కిస్ సీన్ చేశాక డెటాల్‌తో శుభ్రం..!

48
- Advertisement -

లస్ట్‌ స్టోరీస్‌-2 రిలీజ్ కానున్న నేపథ్యంలో బాలీవుడ్‌ నటి నీనా గుప్తా స్పందించింది. దిల్‌ లగీ టీవీ షో కోసం అప్పట్లో ఓ కిస్‌ సీన్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే ఆ సీన్ షూట్ చేసిన తర్వాత రాత్రంతా నిద్ర పోలేకపోయినట్లు నీనా గుప్తా తెలిపింది. ఇన్‌స్టాంట్ అనే బాలీవుడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.

దిలీప్ ధావన్‌తో నేనొక సీరియల్లో నటించా అందులోని ఓసన్నివేశంలో మాపై లిప్ టులిప్ కిస్‌ చిత్రీకరించారు. భారత టెలివిజన్ చరిత్రలో అదే మొట్ట మొదటి లిప్ కిస్ సీన్. ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. మేము పరిచయస్తులం. అతడు అందగాడే కానీ ఈ పరిస్థితులకు దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మేము మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేను. ఆ సీన్‌లో నటించడం కోసం కంగారు పడ్డాడని తెలిపారు. కొంతమంది కామెడీ చేయలేరు. కొంతమంది కన్నీళ్లు పెట్టలేరు అంటూ నాకు నేను నచ్చజెప్పుకొని ముందుకు అడుగేశాను. ఆ సీన్ పూర్తైన వెంటనే డెటాల్‌తో నా నోరు శుభ్రం చేసుకున్నా. అది నాకెంతో కష్టంగా అనిపించింది అని నీనాగుప్తా తెలిపారు. నీనాగుప్తా ప్రస్తుతం లస్ట్‌స్టోరీస్‌-2లో నటిస్తున్నారు.

Also Read: కాజోల్ లస్ట్ కామెంట్స్ వెనుక కథ అదే

- Advertisement -