23న ‘నీది నాది ఒకే కథ’..

156
‘Needi Naadi Oke Katha’ To Release On March 23rd
- Advertisement -

శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు. టీజర్ లో చిత్తూర్ యాసలో శ్రీ విష్ణు పలికిన ఘాటైన డైలాగులు యూత్ ను విశేషంగా ఆకట్టుకొని చిత్రం పై ఆసక్తిని భారీగా పెంచేసాయి.

ఇప్పటివరకు విడుదలైన పాటలు కూడా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ జతగా కనిపించనున్నారు. ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు. ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది.

‘Needi Naadi Oke Katha’ To Release On March 23rd

తారాగణం: శ్రీ విష్ణు, సాత్నా టైటస్, పోసాని కృష్ణ మురళి, దేవి ప్రసాద్ ,నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్ & అట్లూరి నారాయణ రావు ,బ్యానర్: అరన్ మీడియా వర్క్స్ & శ్రీ వైష్ణవీ క్రియేషన్స్
సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రాహకుడు: రాజ్ తోట (అర్జున్ రెడ్డి ఫేమ్) ,ఆర్ట్స్: టి.ఎన్. ప్రసాద్ , రచన & దర్శకుడు: వేణు ఊడుగుల.

- Advertisement -