ఎంత ఎదిగిన ఓదిగే ఉండాలంటారు పెద్దలు… ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలసినోడు గొప్పోడు..ఎంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. ఇవి కేవలం సినిమాల్లో హీరోలు చెప్పేవి మాత్రమే కానీ ఇక్కడ ఓ ప్రధాని ఆ డైలాగులను అక్షరాల నిజం చేసి చూపించారు. మాములుగా రాజకీయ నాయకులు ఎదైనా తమ చేతిలోంచి కింద పడితే తమ సెక్యూరిటీగాని, తమ పక్కన ఉన్న వాళ్లు కాని తీస్తారు. అందుకు విరుద్దంగా చేశాడు నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్. ఆ ప్రధాని చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రపంచలోని ప్రధానుందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
పార్లమెంట్ హాలులో మరికొంత మందితో కలిసి నడుచుకుంటూ బయటకు వస్తుండగా తన చేతిలో పట్టుకొస్తున్న కాఫీ డోర్ తాకి కిందపడింది. దింతో అక్కడ క్లినింగ్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న మాప్ అందుకుని ప్లోర్ ను క్లిన్ చేశారు. ప్రధని హోదా లో ఉంది ఏ మాత్రం సిగ్గపడకుండా హాల్ క్లిన్ చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. క్లినింగ్ సిబ్బంది వచ్చిన వారిని పక్కనే నిలబెట్టి ఆయన హాల్ ను క్లిన్ చేశారు. దింతో ఇప్పుడు ఈప్రధాని చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు పలు కామెంట్లు కూడా పెడుతున్నారు. క్లినింగ్ వాళ్లు వచ్చిన కూడా అతను పనిచేస్తుండటంతో అక్కడున్నవారందరూ అశ్చర్యానికి గురయ్యారు.
True democracy, true leadership, no luxuriousness, no circle of sycophants and apple-polishers, no protocol, true public servant not ruler, simple & humble style of politics 👇
Dutch PM Rutte accidentally spilled his coffee and then did not hesitate to clean up the mess himself. pic.twitter.com/9MhkX7vAmI— Ameer Abbas (@ameerabbas84) June 5, 2018