యోగికి.. పతంజలి షాక్..

205
yogi, ramdev baba
- Advertisement -

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‎కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పొందడంతో సొంత పార్టీనేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని, అవినీతి వల్లనే బీజేపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలే విమర్శించిన విషయం తెలిసిందే. ఇక యూపీలో రూ.6 వేల కోట్లతో మెగా ఫుడ్ పార్క్ స్థాపించాలనుకున్న పతంజలి సంస్థ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెబుతోంది.

 Yogi Adityanath reaches out to Patanjali CEO Acharya Balkrishna

ఇక ఈ విషయం తెలుసుకున్న యోగి వెంటనే పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబాకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఈ మెగాఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టును యమునా ఎక్స్‎ప్రెస్ హైవే సమీపంలో 425 ఎంకరాల్లో ఏర్పాటు చేయాలని భావించామని, కానీ యోగి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందచడం లేదని, అనుమతుల కోసం చాలా కాలం ఎదురు చూశాం. సీఎం యోగి ఆదిత్యనాథ్‎ను కూడా కలినా ఫలితం లేదని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ అన్నారు.

ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మితమైతే ఎంతో మంది రైతులు, కూలీలు బాగుపడతారని, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు. రాందేవ్ బాబాతో మాట్లాడిన సీఎం యోగి ప్రాజెక్టు యూపీలోనే ఏర్పాటు అయ్యేలా బాబాను ఒప్పించాడో లేదో చూడాలి ఇక.

- Advertisement -