భారత విమానాలపై బ్యాన్ ఎత్తేసిన నెదర్లాండ్స్

59
nedarland

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో భారత విమానాలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు జూన్ చివరి వరకు ఆంక్షలు విధించగా నెదర్లాండ్ మాత్రం భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఏప్రిల్-26,2021న విధించిన నిషేధాన్ని మంగళవారం(జూన్-1,2021) నుంచి ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

భారత్ నుంచి నెదర్లాండ్స్ కి ప్రయాణికుల విమానాలు రాకపోకలు కొనసాగుతాయని అయితే నెదర్లాండ్స్ కి వచ్చే ప్రయాణికులు కరోనా టెస్ట్ నెగిటివివ్ రిపోర్ట్ సమర్పించడం,ట్రావెల్ క్వారంటైన్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఇక, ఫిలిప్పీన్స్ కూడా భారత విమాన ప్రయాణికుల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది.