Bihar:మహిళల మద్దతుతోనే ఎన్డీఏ విజయం

7
- Advertisement -

2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మరోసారి ఘనవిజయం సాధించింది. మెజార్టీకి కావాల్సిన 122 స్థానాల కంటే చాలా ఎక్కువ సీట్లను గెలుపొందింది ఎన్డీఏ. మరోవైపు, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ 40 సీట్లు కూడా దాటలేకపోయింది.

తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. బిహార్‌లో నిరుద్యోగాన్ని తగ్గించడానికి 3 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్న ఆయన బోల్డ్ వాగ్దానం ఓటర్లను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఉద్యోగాల సృష్టికి ప్రత్యేక చట్టాలు తెస్తామని హామీ ఇచ్చారు. యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియా ప్రచారాలు, “యువ సంకల్ప యాత్ర” వంటి కార్యక్రమాలు

గత 20 ఏళ్లుగా నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఓటు వేస్తోందని, ఈసారి తన పార్టీ వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అయితే, వాస్తవానికి ఈ హామీలు ఓటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి; ముఖ్యంగా మహిళల ఓటు పూర్తిగా ఎన్డీఏ వైపు మొగ్గడం తేజశ్వీకి ఎదురు దెబ్బగా మారింది. తేజశ్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ గత ఎన్నికలతో సమానమైన ఓట్ల శాతం సాధించినప్పటికీ, సీట్ల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గనుంది.

2020లో ఆర్జేడీ 23% ఓట్లతో 75 స్థానాలు గెలుచుకుంది. 2025లో కూడా అదే 23% ఓట్లు వచ్చినప్పటికీ, పార్టీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 67% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు. కానీ ముఖ్యంగా గమనార్హమైన విషయం—మహిళలు: 71.6% ఓటింగ్,పురుషులు: 62.8% ఓటింగ్. దాదాపు 9% మహిళల అధిక పాల్గొనడం స్పష్టంగా ఎన్డీఏ విజయం వైపే దారి తీసింది.

Also Read:ప్రజలతోనే..ప్రజల కోసమే పనిచేస్తాం!

- Advertisement -