బిహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిదే విజయం..

173
nda
- Advertisement -

బిహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటింది. మెజారిటీ మార్క్‌ 122 దాటి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడందరి దృష్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమై ఉంది. ఓట్ల లెక్కింపులో ఈ ఉదయం ఆర్జేడీ హవా కొనసాగినా, మధ్యాహ్నం నుంచి బీజేపీ జోరు మొదలైంది. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు. ప్రస్తుతం బీజేపీ, జేడీయూలతో కూడిన ఎన్డీయే కూటమి 123 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దానికంటే ఓ స్థానం ఎక్కువే గెలిచింది.

ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కూడిన మహాఘట్ బంధన్ కూటమి 108 స్థానాలు కైవసం చేసుకుని, మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 7 స్థానాలు గెలుచుకోగా, ఎల్ జేపీ 1 స్థానంలో నెగ్గింది. అటు మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, 17 స్థానాల్లో నెగ్గిన బీజేపీ మరో 2 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో నెగ్గి, 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

- Advertisement -