- Advertisement -
బీహార్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సీట్ల సర్దుబాటును ఖరారు చేశాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ సీట్లు ఖరారయ్యాయి. బీజేపీ 20 స్థానాల నుంచి పోటీ చేయనుండగా, జేడీ(యూ) 12 సీట్ల నుంచి, అలాగే లోక్ జనశక్తి పార్టీ ఐదు సీట్ల నుంచి బరిలో దిగుతాయని వెల్లడించాయి ఎన్డీఏ వర్గాలు.
ఇక ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రీయ లోక్ సమతాపార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) పోటీ చేస్తే.. ఆ పార్టీకి బిహార్‌లో రెండు సీట్లు కేటాయించేలా అంగీకారం కుదిరినట్టు తెలిసింది. కాగా బీజేపీ సీట్ల సర్దుబాటులో భాగంగా యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో సీటును జేడీ(యూ)కు ఇవ్వనున్నట్టు ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. ఇక 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీని తిరిగి అధికారంలోకి తమ పార్టీ కృషిచేస్తుందని కేంద్ర మంత్రి,ఆర్‌ఎల్‌ఎస్‌పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ పేర్కొన్నారు.
- Advertisement -