టీచర్లకు షాకిచ్చిన NCTE

10
- Advertisement -

టీచర్లకు షాకిచ్చింది ఎన్సీటీఈ. ఇప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని తిరస్కరించింది. 5 ఏళ్లకు మించి సర్వీస్ ఉన్న వారంతా 2 ఏళ్లలోపు టెట్ పాసవ్వాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించాలని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతే.. వారు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది.

ఇప్పుడు సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయాలని సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తేదీ నుంచి రెండేళ్లలో టెట్ పరీక్షలో ఉత్తీర్ణత అయితేనే ఉద్యోగంలో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఐదేళ్లలో రిటైర్ అయ్యేవారికి అవసరం లేదని.. అయితే ఈ లోపు వారు పదోన్నతులు పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాలని తెలిపింది.

Also Read:పాక్ వన్డే కెప్టెన్‌గా ఆఫ్రిది

- Advertisement -