నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ పార్టీ నాయకులైన సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవ తీర్మానం చేసి ఎన్నుకొన్నారు. ఈ మేరకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అధికారికంగా ప్రకటించారు. 1999లో పీఏ సంగ్మాతో కలిసి ప్రారంభించిన ఎన్సీపీ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఇతర కీలకమైన భాద్యతలు కూడా అప్పగించారు.
సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, మహిళా యువత, లోక్‌సభ సమన్వయం లాంటి బాధ్యతలను అప్పగించారు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా బాధ్యతలను ప్రఫుల్ పటేల్‌కు అప్పగించారు. అయితే ఇదంతా ఎన్సీపీలో కీలకమైన నేత అజిత్ పవార్ సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తట్కరేకు ఒడిశా, పశ్చిమబెంగాల్, రైతులు మైనారిటీ శాఖల బాధ్యతలు అప్పగించారు. నంద శాస్త్రిని ఢిల్లీ ఎన్సీపీ అధినేతగా ఎంపిక చేశారు. గత నెల ఎన్సీపీ చీఫ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర సినీయర్ నాయకులు ఒత్తిడి మేరకు ఉపసంహరణ చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: అమెజాన్: 40రోజులు.. చిన్నారులు సురక్షితం
అయితే ఇటీవలే ఎన్సీపీ చీఫ్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు ఎంపీ సుప్రీయా సూలే ముంబై పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రధానమైన వారిలో ఒకరు బీజేపీ కార్యకర్తగా చెప్పుకుంటున్నారని సమాచారం. దీనిపై ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. సౌరభ్ పింపాల్కర్ గతంలో కూడా అమరావతి లా యూనివర్సిటీ పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు.
Also Read: Uttarakhand:సెలవులు కాదు రిటైర్మైంట్ తీసుకొండి..