టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వాములవుతున్నారు. తాజాగా ఎన్సీపీ ఎంపీ వందనా చావన్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌పై ప్రశంసలు గుప్పించారు. ఒకరు మొక్కను నాటి మరో ముగ్గురు నాటాలని పిలుపునివ్వడం గొప్ప విషయమని..ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అందరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు బాధపడుతున్న విషయాన్ని అందరు గుర్తించాలన్నారు వందనా. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది… జనాభా నిష్పత్తికి అనుగుణంగా చెట్లను పెంచాల్సిన అవసరం ఉందని వందనా చావన్ తెలిపారు.
ఒకరు మొక్కను నాటి మరో ముగ్గురు మొక్కలు నాటాలని పిలుపు నివ్వడం గొప్ప విషయమన్నారు. పర్యావరణాన్ని సమతూల్యం చేయడంలో చెట్లు ఎంతగానో దోహదపడతాయని… తాను కూడా మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇస్తానని తెలిపారు. వన్ ట్రీ… వన్ ఫ్యామిలీ నినాదంతో అంతా ముందుకు సాగాలన్నారు. ఎన్సీపీ ఎంపీతో పాటు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ మొక్కలు నాటారు.
NCP MP Vandana Chavan Accepted Green Challenge By MP Santosh Kumar, She Planted Three Saplings..