భారీ మూల్యం చెల్లిస్తానని అనుకోలేదు: శరద్‌ పవార్‌

46
sharad
- Advertisement -

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నుంచి నేర్చుకొని రాజకీయాల్లోకి వచ్చానంటూ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు శరద్‌ పవార్‌ వ్యంగ్యంగా స్పందించారు. శరద్ పవార్ కి ఉంగ్లీ పకడ్ కే రాజనీతి మే ఆగే బడే ది, అని ప్రధాని మోదీ వ్యాఖ్యనించిన విషయంపై వివరణ ఇవ్వాలని ఒక విలేఖరి అడిగారు. దీనికి వ్యంగ్యంగా స్పందిస్తూ ఇంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు తెలియదు అని పవార్‌ చమత్కరించారు.

ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షాలను ఏకం చేయడానికి నేను ప్రయత్నిస్తాని… కానీ 2024లో ప్రధాని రేసులో లేను అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాప్రాయాన్ని రూపొందించేందుకు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి మాత్రమే నేను సహాయం చేస్తానని ఆయన అన్నారు.

కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. అచ్ఛే దిన్ (మంచి కాలం) తీసుకురావడం, గ్రామాలను ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేయడం, మరుగుదొడ్లు, తాగు సాగు నీరు అందించడం వంటి హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని పవార్ అన్నారు.

బీజేపీ చిన్న పార్టీలను అధికారం నుంచి తప్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి వాటిని తొలగించేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటోందని మాజీ కేంద్ర మంత్రి అన్నారు. బీజేపీ తన ప్రత్యర్థులపై పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి తప్ప మరొకటి కాదన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలన్నింటిలోని ప్రభుత్వాల శాసనసభ్యులను విభజించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు.

- Advertisement -