ప్రతిష్టాత్మక, భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ((SVCC) సంస్థ మరో భారీ ప్రాజెక్ట్‌ను, ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో మరోసారి సినిమా చేస్తుండగా ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. NC24 వర్కిం్గ టైటిల్‌తో వస్తుండగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన షూట్ కోసం ఓ భారీ సెట్ కూడా వేశారు. ఇక ఈ సినిమాకు మూడు టైటిల్స్‌ను పరిశీలిస్తుండగా ఇప్పటికే ‘వృషకర్మ’ అనే టైటిల్‌పై మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు.
అయితే మరో రెండు టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోండగా టైటిల్ ఏంటా అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read:TTD:స్వర్ణరథంపై కల్యాణ వేంకటేశ్వరుడు

