అమెజాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

8
- Advertisement -

ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అమెజాన్ లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ పెట్టారు వీరేష్ అనే వ్యక్తి.

ఐఫోన్ 15 ప్లస్ కు బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ చేసింది అమెజాన్. పలుమార్లు కస్టమర్ కేర్ తో మాట్లాడినా స్పందన లేకపోవడంతో కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు బాధితుడు.

బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80 వేలు రీఫండ్ తో పాటు రూ.25 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది కన్స్యూమర్ ఫోరం. అయితే కన్స్యూమర్ ఫోరం ఆదేశాలను పట్టించుకోలేదు అమెజాన్ సంస్థ. దీంతో అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది కన్స్యూమర్ ఫోరం.

Also Read:‘కాంత’ ..క్లాస్ రొమాంటిక్ మెలోడీ

- Advertisement -