NBK 109:బర్త్ డే గ్లింప్స్ అదుర్స్

10
- Advertisement -

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా NBK 109 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ బాలయ్య బర్త్ డే సందర్భంగా అదిరే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా నుండి మరో గ్లింప్స్ రిలీజ్ అయింది.

గ్లింప్స్ లో దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు.. అంటూ విలన్ తో డైలాగ్ చెప్పించగా వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాల అర్ధమే తెలియని అసురుడు అనే డైలాగ్ తో బాలయ్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ వైరల్‌గా మారింది.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:Modi:14న ఇటలీకి ప్రధాని

- Advertisement -