నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రంలో నయనతార లీడ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు నటాషా దోషి అనే మలయాళ అమ్మాయి కూడా ఓ కీలక పాత్ర లో నటించనుంది. వీళ్లిద్దరూ కాక ఇంకో హీరోయిన్ కు కూడా ఈ సినిమాలో చోటు ఉందని.. ఆ స్థానాన్ని రెజీనాతో భర్తీ చేయాలనుకుంటున్నారని రెండు మూడు రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే తాజా సమాచారం ప్రకారం ఆ అవకాశాన్ని అందుకుంటోంది రెజీనా కాదట. నాని సరసన ‘పిల్ల జమీందార్’ సినిమాలో నటించిన హరిప్రియ బాలయ్యతో జత కట్టబోతున్నట్లు సమాచారం. ‘పిల్ల జమీందార్’ మినహా హరిప్రియకు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేమీ పడలేదు. చిన్నా చితకా సినిమాలు చేసి కనుమరుగైపోయింది. కన్నడ పరిశ్రమకు వెళ్లి అక్కడ మంచి అవకాశాలే అందుకుంది. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇంతకుముందు బాలయ్య ఇలాగే స్నేహా ఉల్లాల్.. లక్ష్మీరాయ్ లాంటి లైమ్ లైట్లో లేని కథానాయికలకు అవకాశమిచ్చాడు. వాళ్లకు ఆ సినిమాలు పెద్దగా ఉపయోగపడలేదు. మరి హరిప్రియ ఈ అవకాశాన్ని ఏమేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే నెల చివరికల్లా పూర్తి చేసి తన తండ్రి జీవిత కథతో తెరకెక్కనున్న సినిమా మీదికి వెళ్లిపోవాలని బాలయ్య చూస్తున్నాడు.
బాలకృష్ణ, నయనతార, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!