ఎన్బీకే…అఖండ అప్‌డేట్

68
thaman
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఇటీవలె సినిమా సూటింగ్ పూర్తి కాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను సైతం పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోగా సంగీత దర్శకుడు తమన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం చివరి దశ డాల్బీ అండ్ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ శరవేగంగా జరుగుతోందని అన్నారు. శ్రీకాంత్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అఖండ’ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

- Advertisement -