NBK 109..కీ అప్‌డేట్

5
- Advertisement -

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా NBK 109 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా శ‌ క‌న్న‌డ న‌టుడు రిషి విల‌న్ పాత్ర‌లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు బాబీ. ఈ మూవీలోని ఓ కీలక సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్ జైపూర్‌లో జరిగిందని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.

దీంతో ఎప్పుడెప్పుడు సినిమా టీజర్‌ రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గుడ్ న్యూసే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:ఎండు ద్రాక్షతో.. మహిళలకు ఆరోగ్యం!

- Advertisement -