న‌య‌న‌తార‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?

339
nayanatara
- Advertisement -

లేడీ సూపర్ స్టార్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది న‌య‌న‌తార‌. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం అమ్మోరు తల్లి మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ రేటింగుల్లో టాప్ ట్రెండింగ్‌లో వుంది. ఇదిలావుంటే తాజాగా నయన్‌ పెళ్లి జరిగిందంటూ వార్తలు వైరల్‌గా మారాయి. నెటింట్లో ఈ అమ్మడు పెళ్లి కూతురు గెట‌ప్‌లో క‌నిపించి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన కోలీవుడ్ మీడియా అంతా విగ్నేష్ శివన్ – నయనతార రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ప్రాచారం చేస్తున్నారు.

అస‌లు విష‌యం ఏంటంటే.. చెన్నైలోని చీర‌ల షాప్‌కు సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న‌లో న‌టించింది న‌య‌న్‌. అందులో భాగంగా తీసిన ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్స్ న‌య‌న్ పెళ్లి చేసుకుందా ఏంటి అంటూ షాకౌతున్నారు. న‌య‌న్ ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ తో రిలేష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు వ‌చ్చే ఏడాది పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నారు. ఆ సినిమా త‌ర్వాత పెళ్లి చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తుంది.

- Advertisement -