సౌతిండియాలో నయనతారను సూపర్‌స్టార్‌ని చేసిన మలయాళ బ్లాక్‌బస్టర్ `పుదియ నియమం` శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ తెలుగులో `వాసుకి`గా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కి సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.ఆర్. మోహన్ మాట్లాడుతూ -“తెలుగు కోసం మా `వాసుకి` చిత్రాన్ని ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా మన నేటివిటీని ప్రతిబింబిస్తూ, భారీ స్థాయిలో సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు పూర్తి చేశాం. నెలాఖరులోగా సెన్సార్ పూర్తి చేసి, వేసవి కానుకగా రిలీజ్ చేస్తాం. తొలికాపీ చూశాక ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వాసుకి చిత్రం తెలుగులో అద్భుత విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ చిత్రంలో తన నటనతో నయన్ ప్రతి తెలుగు ప్రేక్షకుని మనసులో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటుంది. నయనతార చిత్రంతోనే మేం తెలుగు చలనచిత్ర రంగంలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకంతోనే వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు“ అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: వర్గీస్ రాజ్, సంగీతం: గోపి సుందర్, బ్యానర్: శ్రీరామ్ సినిమా, నిర్మాత: ఎస్.ఆర్.మోహన్, దర్శకత్వం: ఎస్.కె.షాజన్. మాటలు:వెంకట్ మల్లూరి, పాటలు:భువనచంద్ర,వెన్నెలకంటి