సుందర్.సి దర్శకత్వంలో ఆర్య, జయం రవి తదితరులతో ‘సంఘమిత్ర’ రూపొందనున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి శృతిహాసన్ లీడ్ క్యారెక్టర్ చేయాల్పివుంది.కాని ఈ సినిమా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కారణాలు తెలియదుగాని ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లీడ్ క్యారెక్టర్ శృతిహాసన్ తప్పుకుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ విషయం చర్చనీయాంశమైంది.
ఈ సినిమాకు వెన్నముక లాంటి సంఘమిత్ర పాత్రధారి శృతిహాసన్ తప్పుకోవడం ద్వారా ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా అనే సందేహం వ్యక్తమవుతున్నది. ఈ చిత్రన్ని శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారు బహుభాషా చిత్రం నిర్మిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు విషయంలో అసంతృప్తికి లోనై శృతి తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్లను అనుకున్నారు. అయితే మొదట అనుష్క .. తమన్నా .. హన్సిక పేర్లను పరిశీలించారు.
అనుష్క ,తమన్నాలను సంప్రదించారట కూడా. అయితే వాళ్లు ఎలా స్పందించారన్నది తెలియదు గానీ, తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. నయనతార ఒకసారి ప్రాజెక్టుకి ఓకే చెబితే, ఒక తపస్సులా దానిని పూర్తి చేస్తుంది. ఇది రెండు సంవత్సరాల పాటు కొనసాగే ప్రాజెక్టు కనుక, నయనతార కమిట్మెంట్.. ఆమెకి గల మార్కెట్ తమకి కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ కారణంగానే ఆమెను ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.మరి ఈ సినిమాకి నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.