ఎంత చెప్పినా ఇదేం మాయరోగం…

299
charmi gets controversy on dress for gurudvar temple
- Advertisement -

ఈ మధ్య సెలెబ్రిటీలు చేసే పనులు, వారి ప్రవర్తన వల్ల తెగ విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి వారికి తెలిసే ఇలా చేస్తున్నారా? తెలియక పొరపాట్లు చేస్తున్నారో తెలీదుగానీ..వారు చేసే పనులను మాత్రం నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఎంత చెప్పినా ఇదేం మాయరోగం..సెలెబ్రిటీలకు ఆ మాత్రం తెలీదా? అంటూ తిట్టిపోస్తున్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ముందు ప్రియాంకా చోప్రా మోకాళ్ళు కన్పించే దుస్తులతో, అందులోనూ.. కాళ్ళ మీద కాళ్ళేసుకుని కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ప్రియాంకా చోప్రా  విమర్శల్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
charmi gets controversy on dress for gurudvar temple
అయితే తాజాగా ఛార్మి కూడా అలాంటి వివాదంలోనే ఇరుక్కుంది. ప్రస్తుతం పోర్చుగల్‌లో బాలకృష్ణ హీరోగా, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమా షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ లో భాగంగా అక్కడకి వెళ్ళిన చార్మీ ఓ గురుద్వారాని సందర్శించింది. అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అక్కడ విశేషాలను అభిమానులతో పంచుకుంది. ఇక్కడే మొదలైంది అసలు వివాదం.
charmi gets controversy on dress for gurudvar temple
అసలు విషయమేమిటంటే.. గురుద్వారా సందర్శన బాగానే ఉన్నా.. ఛార్మీ వేసుకున్న డ్రెస్‌లో మరీ ఇంత పొదుపు పాటించాలా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నల్లటి లాంగ్ షర్ట్ ధరించిన చార్మి తొడలు కనిపించే విధంగా ఉన్న డ్రెస్‌తో గురుద్వారాను సందర్శంచింది. అంతేకాదు మోకాళ్లపై కూర్చొని ప్రసాదాన్ని స్వీకరించింది. ఈ ఫోటోల్లో అమ్మడు భక్తి మాట అటుంచింతే దైవదర్శనానికి వెళ్లే పద్దతి ఇదేనా చార్మీ అంటూ ప్రశ్నిస్తున్నారు.
charmi gets controversy on dress for gurudvar temple
ఈ విషయంలో చార్మీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కథానాయికలు గ్లామర్ మీద దృష్టి పెట్టడంలో తప్పులేదు. కానీ సమయం, సందర్భం అనేవి లెక్కలోకి తీసుకోవడం మర్చిపోకూడదు. కావాలని గురుద్వారను అలా సందర్శించిందో.. తెలియక చేసిందో.. కానీ మొత్తానికి నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకతను అయితే ఎదుర్కుంటోంది.

ఆన్ స్క్రీన్ మీద గ్లామర్ పండించడంలో లిమిట్స్‌ను చెరిపేస్తున్న కథానాయికలు ఇలాంటి సెంటిమెంట్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో లేకపోతే ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవాల్సివస్తుంది.
charmi gets controversy on dress for gurudvar temple
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లేడీగా ఇమేజ్ తెచ్చుకున్న ఛార్మికి ప్రస్తుతానికి సినిమా ఆఫర్లేవీ లేవనే చెప్పాలి. దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో కలిసి ‘పూరీ కనెక్ట్స్’ అనే పేరుతో కాస్టింగ్‌ను ఎంపిక చేసే ప్రత్యేకమైన బిజినెస్‌ను స్టార్ట్ చేసిన ఛార్మింగ్ లేడీ. ప్రస్తుతం ఆ వ్యవహారాలతో పాటు పూరీ జగన్నాధ్ సినిమాలకు సంబంధించిన అంశాలను కూడా హ్యాండిల్ చేస్తోందనే ఎప్పటి నుంచో టాక్.

- Advertisement -