6కోట్లు అడుగుతున్న లేడీ సూపర్‌స్టార్‌..!

451
Nayanthara
- Advertisement -

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా, దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న నయనతార వరుస సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ భామ పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తికరయకమైన ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మడు తాజాగా తన రెమ్యునరేషన్ రూ.6 కోట్లకు పెంచేసినట్లుగా చెబుతున్నారు. ఇదో రికార్డుగా పలువురు అభివర్ణిస్తున్నారు.

తొమ్మిదేళ్ల క్రితం పయ్యా సినిమాకు కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేసి వార్తల్లోకి ఎక్కటమే కాదు.. ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది నయన్‌. అలాంటి ఈ బ్యూటీ తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ.. ఇండస్ట్రీలోని హీరోయిన్ల రెమ్యునరేషన్ రేంజ్‌ను భారీగా పెంచేలా చేసిందంటున్నారు.

ఈ మళయాళి బ్యూటీ ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలతో.. మరో వైపున స్టార్ డమ్ వున్న యువ కథానాయకులతో.. ఇంకో వైపున వర్ధమాన కథానాయకులతోను సినిమాలు చేయడం.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా మెప్పించడం ఈమె ప్రత్యేకత. అలాంటి నయనతార చిరంజీవి సరసన ‘సైరా’ చేసింది. తమిళంలో రజనీ సరసన ‘దర్బార్’.. విజయ్ జోడీగా ‘బిజిల్’ చిత్రంలో నటిస్తోంది.

- Advertisement -