అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు బాలయ్య బాబు. ఈ షోతో బాలయ్యలోని కొత్తకోణాన్ని చూడగా చిన్న,పెద్ద తేడా లేకుండా అందరితో ఎలా కలిసిపోతాడో తెలిసి పోయింది. ముఖ్యంగా చిన్నపిల్లాడిలా బాలయ్య చేస్తున్న అల్లరి అందరికి నచ్చుతోంది.
అయితే తాజాగా బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్ చేసింది నటి నయనతార. కనెక్ట్ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో బాలకృష్ణతో వర్కింగ్ ఎక్స్పేరెన్స్ గురించి చెప్పుకొచ్చింది.
బాలకృష్ణ సర్‌తో నేను డిఫరెంట్ జోనర్స్ లో మూవీస్ చేశా. ఆయన్ని చూసి అందరు భయపడతారు గాని, బాలకృష్ణ సర్ చాలా సరదా మనిషి అని తెలిపింది. గతంలో తాను ప్రభాస్ చాలా ఆకతాయి వ్యక్తి అని చెప్పాను కానీ బాలకృష్ణ సర్ ప్రభాస్ కంటే పెద్ద ఆకతాయి అంటూ తెలిపింది. ప్రస్తుతం నయన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి..