తెలుగు హీరోలను హర్ట్ చేసిందా..?

377
Nayanthara-
- Advertisement -

టాలీవుడ్‌లో టాప్ హీరోలతో నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ నయనతార. అయితే గత కొంత కాలంగా కోలీవుడ్‌కు అంకితమైన ఈ భామ అక్కడ వరస హిట్స్‌తో దూసుకుపోతోంది. ఒకపక్క స్టార్ హీరోలు, చిన్న హీరోలతో సినిమాలు చేస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ అదరగొట్టేస్తుంది.ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో దున్నేస్తున్న నయనతార… మీడియాతో చాలా తక్కువగా మాట్లాడుతుందనే టాక్ మొదటినుండి ఉంది.

nayanthara-

వయసు మీద పడుతున్న కొద్దీ.. తరగని అందాలతో.. అన్ని వర్గాల్ని అంతకంతకూ మెస్మరైజ్ చేసే నయనతార ఇటీవల ఒక ప్రశ్నకు బదులిస్తూ.. తన అభిమాన హీరోలు అజిత్.. విజయ్ లని చెప్పింది. మీడియాతో చాలా తక్కువగా మాట్లాడే ఆమె నోటి నుంచి వచ్చిన ఈ సమాధానం అందరి దృష్టిని ఆకర్షించటమేకాదు.. టాలీవుడ్ ను హర్ట్ చేసిందన్న మాట వినిపిస్తోంది.కోలీవుడ్ లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నయనతారకి మీకు ఏ స్టార్ హీరోస్ అంటే ఇష్టమనే ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకి బదులుగా తనకి కోలీవుడ్ హీరోస్ విజయ్ అన్నా… అలాగే అజిత్ అన్నా చాలా ఇష్టమని చెప్పి టాలీవుడ్ హీరోస్ ని హార్ట్ చేసింది.

- Advertisement -