కుర్ర హీరోకు నో చెప్పిన నయన్‌..!

438
- Advertisement -

లేడీ సూపర్‌ స్టార్‌ నయన తారా తమిళ,తెలుగు భాషల్లో వరుస సినిమాలో దుసుకెళ్తోంది. ఈ అమ్మడు అందరూ ఒకేలా ఉంటే ప్రత్యేకత ఏముంటుంది? తనకు నచ్చిన ప్రాజెక్టులో తప్పించి.. నచ్చని ప్రాజెక్టును నిర్మోహమాటంగా నో చెప్పేస్తోంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. కోలీవుడ్‌లో కొత్త హీరో శరవణన్‌కు జోడీ హీరోయిన్‌గా నయనతార అయితే బాగుంటుందని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించారట.

Nayantharaఅయితే లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌తో, లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై కన్నేసిన ఆమె, కొత్త హీరో అనేసరికి వద్దని చెప్పేసిందట. అయినా వదలని నిర్మాతలు పది కోట్ల రెమ్యూనరేషన్‌ ఇస్తామని నచ్చజెప్పినా అంగీకరించలేదట. కొత్త నటుడు కావడంతోనే నయన్ అంగీకరించలేదని కొంతమంది, పాత్ర నచ్చలేదని మరికొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సివుంది.

- Advertisement -