‘RRR’కు మరో షాక్‌..!

330
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బడ్జెట్‌ రూపొందిస్తున్నారు జ‌క్క‌న్న. రామ్ చరణ్.. ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ కథానాయిక‌గా న‌టిస్తుంది. స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గణ్ వంటి ప్ర‌ముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో పలు చిక్కులు వస్తున్న సంగతి తెలిసిందే.

Emma Roberts

ఇదివరకే హీరోలిద్దరు గాయపడటంతో కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. తరువాత ఎన్టీఆర్‌కు జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. డైసీ స్థానంలో హాలీవుడ్ భామ ఎమ్మా రాబర్ట్స్ ను ఎంచుకున్నారని.. రాజమౌళి ఇప్పటికే ఎమ్మాతో చర్చలు జరిపారని త్వరలో ఆమె ‘RRR’ టీమ్‌తో జాయిన్ అవుతుందని వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా ఎమ్మా రాబర్ట్స్ ఈ ‘RRR’లో నటించేందుకు నిరాకరించిందని సమాచారం. ఈ సినిమాలో నటించడానికి ఆమెకు అభ్యంతరం లేకపోయినా బల్క్ డేట్స్ ఇచ్చేందుకు ఆసక్తి లేని కారణంగా ‘నో’ చెప్పిందని టాక్. దీంతో రాజమౌళి ఎన్టీఆర్ కు జోడీగా మరో భామ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు. దీనిపై చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

- Advertisement -