క్యాష్ చేసుకోలేకపోతున్న నయనతార

26
- Advertisement -

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సక్సెస్ తర్వాత నయనతార ఒక్కసారిగా బిజీ అయ్యింది. నిజానికి, ఈ హిట్ కి ముందు నయనతారకి బోలెడన్ని ఆఫర్స్ వచ్చినా అందులో నయనతారకి హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ, అందులో నయనతార అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. మళ్ళీ జవాన్ తో నయనతార రేంజ్ మారిపోయింది. 39 ప్లస్ లోనూ నయనతార అందంగా, ఆకర్షణగా కనిపించడం.. ఆమెకు బాలీవుడ్ లోనూ ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో నయనతారకి హిందీలో పలు నిర్మాణ సంస్థల నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నయనతార, అజిత్ సినిమా చేస్తోంది. అలాగే, అజిత్ రెండో సినిమాకి కూడా నయనతార సైన్ చేసిందని టాక్. దీంతో, ఇప్పుడు నయనతార హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో అజిత్ కొత్త చిత్రానికి, అలాగే అజిత్ రెండో చిత్రానికి డేట్స్ కేటాయించడంతో నయనతారకి ఇబ్బందులు మొదలయ్యాయట.

ముఖ్యంగా అజిత్ రెండు సినిమాలకు ఎక్కువగా విదేశీ లొకేషన్స్ ఉండడం, షూటింగ్ కూడా అనుకున్న విధంగా జరగకపోవడంతో నయనతారకి ఇప్పుడు సమస్య వచ్చి పడింది. కొత్తగా అవకాశాలు వస్తున్న హిందీ సినిమాలకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతోంది. మొత్తానికి నయనతారకి హిందీలో భారీగా డిమాండ్ పెరిగినా.. ఆ డిమాండ్ ను మాత్రం ఆమె క్యాష్ చేసుకోలేకపోతుంది.

Also Read:అసెంబ్లీలో కేఏ పాల్..

- Advertisement -