నయన్‌ కోసం క్యూ కట్టేస్తున్నారు..

222

నయన తార ‘మాయ’ వంటి హార్రర్ కమ్ హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలతో తమిళం, తెలుగు ప్రేక్షకులను మెప్పింస్తుంది. హర్రర్‌ తరహా చిత్రాల్లో నటించేందుకు అమితాసక్తి చూపుతోంది.ఇప్పుడు నయనతార తమిళనాట ఎంత బిజీయో మనం వేరే చెప్పక్కర్లేదు.

వరుసపెట్టి సినిమాలను సైన్ చేస్తోనే ఉంది. అమ్మడు 2-3 కోట్లు ఇచ్చి లీడింగ్ రోల్లో పెట్టుకోవడానికి అక్కడి నిర్మాతల తెగ క్యూ కట్టేస్తున్నారు. ఇక ప్రస్తుతం వేలైక్కరన్ సినిమా చేస్తున్న నయన్.. ఆ షూటింగ్ స్పాటులో గాయల పాలైందట. కాని షూటింగ్ ఆగడం ఇష్టం లేదు కాబట్టి.. అమ్మడు ఏం చేసిందో తెలుసా?

Nayanthara is highest paid South actress

ధృవ సినిమా తమిళ ఒరిజినల్ తీసిన మోహన్ రాజా.. ఇప్పుడు నయనతారను మరోమారు తన హీరోయిన్ గా తీసుకున్నాడు. రెమో మూవీ ఫేం శివ కార్తికేయన్ రూపొందిస్తున్న సినిమాలో నయనతార మరోసారి కనిపించనుంది. అయితే తన గాయాల కారణంగా షూటింగ్ ఆగిపోకూడదని ఫిక్సయిన నయన్.. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ మరియు ఇతర మందులు వేసుకుని షూటింగ్ కు వచ్చేస్తోందట. తద్వారా తన ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తోందట.

అయితే కనీసం ఆడియో ఫంక్షన్లకు కూడా రాని నయన.. అసలు సోషల్ మీడియాలో ఎక్కడా లేని నయన.. ఈ విషయం బయటకు ఎలా చెప్పిందబ్బా మీరు మరీనండీ.. నయనతార పి.ఆర్. యాక్టివిటీలు మామూలుగా ఉండవ్ తెలుసా. అమ్మడు ప్రతీ చిన్న విషయాన్ని పి.ఆర్ టీమ్ ద్వారా పెద్ద న్యూస్ చేయించడంలో దిట్ట.