ఆర్మీ మ్యాన్‌గా డీజే‌‌..

481
Allu Arjun as A Army Man in Na Peru Surya

‘గంగోత్రి’ చిత్రంతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై త‌న న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేస‌ుకున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టైటిల్ ను బట్టే ఇది దేశభక్తితో ముడిపడిన సినిమా అనే విషయం అర్థమైపోతోంది.

Allu Arjun as A Army Man in Na Peru Surya

మరి ఈ సినిమా ఆరంభంలోనే అల్లు అర్జున్ ఆర్మీ మేన్ గా కనిపించనున్నాడని చెబుతున్నారు. భారత్ – పాకిస్తాన్ కి మధ్య గల వార్ సీన్ తో ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. ఈ సీన్ ను ఒక రేంజ్ లో చిత్రీకరించవలసి వుంటుంది గనుక, అందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట. భారీ సెట్స్ కోసం భారీగా ఖర్చు పెట్టనున్నట్టు చెబుతున్నారు. ఈ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.మరి అల్లు అర్జున్ తాజాగా దువ్వాడ జగన్నాథమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తెలుగు సినిమాకు ఐకాన్‌గా మారిన బన్నీకి ఇతర లాంగ్వేజెస్‌లో కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది.