- Advertisement -
కోలీవుడ్ హాట్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి జూన్ 9న మహాబలిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పెళ్లికి రావాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ను ఆహ్వానించారు నయన్ – విగ్నేష్. అలాగే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ను కూడా ఆహ్వానించారు.
ఈ జంట వివాహానికి తమిళ్, తెలుగు, మలయాళం.. ఇలా సౌత్ సినిమా సెలబ్రిటీలు చాలా మంది హాజరవనున్నట్టు సమాచారం. వీరి పెళ్లిని నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది.
- Advertisement -