కరోనాపై పోరు ముందుకొచ్చిన దీప్‌వీర్,నయన్

149
nayan

కరోనాపై పోరులో తమవంతు సాయం అందించేందుకు సినీ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు టాలీవుడ్,కోలీవుడ్,బాలీవుడ్‌కు చెందిన హీరో,హీరోయిన్లు విరాళాలు అందించగా తాజాగా బాలీవుడ్ స్వీట్ కపుల్ రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణె,కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ముందుకొచ్చారు.

పీఎం కేర్స్‌కు తమవంతు సాయం అందివ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే ఎంత విరాళం ఇస్తున్నామో వెల్లడించలేదు. ఇక నయనతార తనవంతుగా రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించింది. కరోనా కారణంగా ఉపాధి కొల్పోయిన సినీ కార్మికుల కోసం తనవంతు సాయాన్ని అందించానని వెల్లడించింది.

కరోనాపై పోరులో భాగంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఉద్యోగులు తమవంతుగా పీఎం కేర్స్‌కు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.