కవలలకు జన్మనిచ్చిన నయన్‌..

55
Nayanthara
- Advertisement -

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది నయనతార. కవలలకు జన్మనిచ్చారు నయన్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు విఘ్నేష్ శివన్. వీరిద్దరూ పెళ్లి చేసుకుని 4 నెలలు మాత్రమే కావడంతో.. ఇది నిజామా? ప్రాంక్? అనే తికమకలో పడ్డారు.

నయనతార, నేను అమ్మానాన్నలు అయ్యాం. మాకు కవల పిల్లలు జన్మించారు. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదం అన్నీ కలిసి, మాకు ఇద్దరి బిడ్డల రూపంలో వచ్చాయి. మా ఉయిర్ & ఉలగం కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి అని విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశాడు. అలాగే నయన్ అండ్ శివన్ పిల్లల చిన్న పాదాలను ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.

అయితే వీరిద్దరూ ఆరు సంవత్సరాల రిలేషన్ షిప్ తర్వాత జూన్ 9, 2022న మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్‌లో కుటుంబ సమేతంగా వివాహం చేసుకున్నారు.

- Advertisement -