తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయన్‌-విఘ్నేష్..

113
- Advertisement -

కోలీవుడ్ హీరోయిన్‌ నయనతార తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా వీరు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన నయనతారను చూడటానికి భక్తులు ఉత్సాహం చూపించారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు యత్నించారు.

- Advertisement -