ఆమె బాలయ్య కూతురట..!

216
- Advertisement -

నటసింహాం బాలకృష్ణ పై ఊహించని వ్యాఖ్యలు చేసింది టాలీవుడ్‌ బ్యూటీ నయనతార. నయన్‌ చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారాయి. బాలయ్యతో కలిసి శ్రీరామరాజ్యం, సింహా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ‘ జై సింహా’ ముచ్చటగా మూడోసారి బాలయ్య సరసన నటిస్తోంది.

బాలయ్య, నయన్‌ ల మధ్య ఆన్‌ స్ర్కీన్‌లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవుతుందని, అలాగే హిట్ పెయిర్ గా కూడా వీరు పెరుతెచ్చుకున్నారన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలయ్యను తాను తండ్రిలా భావిస్తానని చెప్పింది. ఆయనను చూస్తే గౌరవంతో రెండు చేతులు జోడించి, దణ్ణం పెట్టాలనిపిస్తుందని తెలిపింది.

 Nayanathara Says Balakrishna Like My Father

బాలయ్యతో కలసి నటించడమంటే తనకు ఎప్పుడూ ఇష్టమేనని చెప్పింది. బాలకృష్ణ తనకు ఎప్పుడూ సొంత కుటుంబ సభ్యుడిగానే కనిపిస్తారని తెలిపింది. మొత్తానికి నయన్‌ నోట ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని బాలయ్య ఫ్యాన్స్‌ తో పాటు, సినీ లవర్స్‌ కూడా ఊహించిఉండరనే చెప్పాలి.

- Advertisement -