‘కర్తవ్యం’ సెన్సార్ కంప్లీట్‌..

225
nayanatara karthavyam movie sencor compleated
- Advertisement -

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts ) పతాకం పై తమిళం లో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచినా ఆరమ్ (Araam) చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా చిత్రం. నయనతార ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా మనకు కనువిందు చేస్తున్నారు.

 nayanatara karthavyam movie sencor compleated

తెలుగు లో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ తో త్వరలో విడుదలకు సిద్ధం గా ఉంది. తమిళం లో విడుదలైన ఈ చిత్రం నయనతార కు ఎంతో కీర్తి ప్రతిష్ఠా తెచ్చిపెటింది . ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులకి తాను ఎప్పటికి రుణపడి ఉంటాను అని తాను తెలియచేసారు. తాను మరిన్ని మంచి చిత్రాలు చేస్తాను అని తెలియచేసారు.

ఈ సందర్భంగా ఆర్ రవీంద్రన్ మాట్లాడుతూ “తమిళం లో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నయనతార కెరీర్ లోనే పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం మాకు ఉంది. తెలుగు లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మరియు సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన నిర్మాత శరత్ మరార్ తో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేయటం చాల సంతోషం గా ఉంది. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కర్తవ్యం చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం.”మన్నారు. ఇక ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందించగా, చక్రం, డేంజర్ మరియు కృష్ణార్జున చిత్రాలకి పనిచేసిన ఓం ప్రకాష్ ఈ చిత్రానికి కెమరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -