అందుకే ‘నయనతార’ ప్లేస్ లో త్రిష

25
- Advertisement -

లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ మళ్లీ యాక్టివ్ కాబోతుంది. ఈ మధ్య త్రిషకి బాగా డిమాండ్ పెరిగింది. మెగాస్టార్ సినిమాలో కూడా ‘త్రిష’నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఐతే, టాలీవుడ్ లో నయనతార కంబ్యాక్ తో స్వీటీ త్రిషకి చెక్ ప‌డే అవ‌కాశం ఉందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. న‌టీమ‌ణులుగా ఈ ఇద్ద‌రు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగారు. కానీ, నయనతార ముందు త్రిష ఎప్పుడూ తక్కువే. పైగా హీరోయిన్ గా త్రిష కంటే నయనతార చాలా సీనియ‌ర్. క్రేజ్ ప‌రంగా ఇద్ద‌రు పోటా పోటీగానే క‌నిపిస్తారు. కానీ, నయనతారకి జవాన్ రూపంలో పాన్ ఇండియా ఇమేజ్ యాడ్ అయ్యింది.

నిజానికి చిరంజీవి న‌టిస్తోన్న‌’విశ్వంభ‌ర‌’లో మొదట నయనతారనే హీరోయిన్. ఐతే, నయనతార తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడానికి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ లోపు త్రిష‌ ఫామ్ లోకు వచ్చింది. చిరంజీవి సినిమాలో కూడా త్రిష‌నే ఎంపిక చేసారు. ఐతే, నయనతార మళ్ళీ యాక్టివ్ కావడంతో.. ఇప్పుడు నయనతార – త్రిష ఇద్ద‌రి మ‌ధ్యా నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ముఖ్యంగా బాలయ్య కొత్త సినిమాలో చాలా మంది నయనతారని తీసుకుంటే బాగుంటుంద‌ని మెజార్టీ వ‌ర్గం భావించింది. కానీ, మేక‌ర్స్ మాత్రం నయనతార ను భరించగలమా ? అనే డైలమాలో పడ్డారు.

అందుకే, బాలయ్య టీమ్ కూడా త్రిష వైపే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే, బడ్జెట్ అన్నది అబద్దం అని, అసలు నయనతారని కాద‌ని త్రిష‌ని తీసుకోవ‌డం వెనుక ఏదో కారణం ఉందని టాక్ నడుస్తోంది. గతంలో, బాలయ్య సినిమాని నయనతార చేయను అని తేల్చి చెప్పింది. ఆ సినిమానే అఖండ. నయనతార రిజెక్ష‌న్ అనేది కూడా ఇక్క‌డితో ఆగిపోయేది కాద‌ని, మళ్లీ ఆమె బాలయ్య సినిమాని రిజెక్ట్ చేస్తే బాగోదు కాబట్టి, అందుకే నయనతార కాదు అని త్రిష వైపు బాలయ్య టీమ్ ఆసక్తి చూపిస్తోంది.

Also Read:మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ వీళ్ళే!

- Advertisement -