బాంబు దాడి..9 మంది జవాన్లు మృతి

2
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేశారు మావోయిస్టులు. ఐఈడీ బాంబుతో దాడి చేయగా 8 మంది డిస్ట్రిక్ట్​ రిజర్వ్​ గార్డ్​-డీఆర్​జీ సిబ్బందితో పాటు ఓ డ్రైవర్​ మృతి చెందినట్లు బస్తర్​ రేంజ్​ ఐజీ సుందర్​రాజ్ తెలిపారు. దాడి జరిగిన సమయంలో వాహనంలో 15 మంది భద్రతా సిబ్బంది ఉండగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దంతెవాడ, నారాయణ్​పుర్​, బీజాపుర్​లో యాంటీ నక్సలైట్ అపరేషన్ పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం కాగా బీజాపుర్​లోని కుట్​రూ హరదారిపై వెళుతున్న క్రమంలో మావోయిస్టులు ఐఈడీ పేల్చేశారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది.

మావోయిస్టుల చేసిన ఈ దాడిపై ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్​ సాయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read:లాయర్‌ని ఎందుకు రానివ్వలేదు: సోమ భరత్

- Advertisement -