నా భార్య జెండాలో క‌ర్ర లాంటిది : సిద్ధూ

204
Navjot Sidhu meets AAP state incharge after talks
- Advertisement -

పంజాబ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విక్ట‌రీ కొట్టింది. మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ తరఫున అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ  పోటీ చేసి గెలుపొందారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న గెలుపులో త‌న భార్య పాత్ర కూడా ఉంద‌ని, ఆయన భార్య జెండాలో క‌ర్ర లాంటిద‌న్నారు. రాష్ట్రం మొత్తం ఆమె సూచించిన‌ట్లుగానే ప‌ర్య‌ట‌న కొన‌సాగించిన‌ట్లు సిద్ధూ చెప్పారు. అంతేకాకుండా‘ఇది కాంగ్రెస్‌కి పునరుజ్జీవనం లాంటిది.

ఈ ఫలితాలు ఆరంభం మాత్రమే అని అన్నారు.  ఇక కాంగ్రెస్‌ ఇక ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ విజయం దిశగా ముందుకు వెళ్తుందని ఇప్పుడు ఆయన కావాల్సింది పంజాబ్‌ అభివృద్ధి అని, ఆయన నమ్మకమే ఆయనను గెలిపించిందన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్‌కి నూతన సంవత్సర కానుక’ అని అన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 12 స్థానాలు గెలుచుకుని 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
Navjot Sidhu meets AAP state incharge after talks
ఇదిలా ఉండగా..పంజాబ్‌లో అధికారంలోకి రావడం ఖాయం కావడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ విలేకర్లతో మాట్లాడుతూ రేపు సీఎల్‌పీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దీనిలో ముఖ్యమంత్రి అభ్యర్థిని లాంఛనంగా ఎన్నుకోనున్నారు. ఇక్కడ దాదాపు 10ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్‌లో 59 స్థానాలు సాధించిన పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఇక్కడ 70కి పైగా స్థానాల్లో విజయం సాధించే దిశగా పయనిస్తోంది.

- Advertisement -