నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ ప్రయోగం విఫలమైంది. నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1 హెచ్ (రీప్లేస్‌మెంట్) ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టాలనుకున్నారు. అయితే, పీఎస్‌ఎల్‌వీ సీ–39 నుంచి ఉష్ణకవచం వేరుపడలేదు.
1,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం విజయవంతం అయితే నావిగేషన్ వ్యవస్థలో కీలకంగా ఉండేది. పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయిందని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ ప్రకటించారు. సాంకేతిక లోపం కారణంగా హీట్ షీల్డ్ విడిపోలేదని వివరణ ఇచ్చారు.
నావిగేషన్ వ్యవస్థ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. ఉపగ్రహ శ్రేణిలో ఇది ఎనిమిదవది. ఈ ప్రయోగంతో దేశానికి సొంత నావిగేషనల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1ఏ ఉపగ్రహంలో 3 రుబీడియమ్ అణు గడియారాలు పనిచేయకపోవడంతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1హెచ్‌ను ప్రయోగిస్తున్నారు.
#WATCH: ISRO launches navigation satellite IRNSS-1H carried by PSLV from Sriharikota in Andhra Pradesh. pic.twitter.com/KlfmbyDIMZ
— ANI (@ANI) August 31, 2017