బుల్లితెర‌ పై నెం.1….. యారి విత్ రాణా

197
Rana's No 1 Yaari Breaks Into No 1 Spot
- Advertisement -

స్టార్ హీరో దగ్గుబాటి రానా గారు హోస్ట్ గా చేస్తున్న నెం 1 యారి షో ఇప్పుడు తెలుగులో నెం 1 షో గా నిలిచింది. ఈ మధ్య మన తెలుగులో బాలీవుడ్ తరహాలో స్టార్స్ హోస్ట్ చేస్తున్నారు కాని స్టార్ హీరోలు హోస్ట్ గా చేసినంత మాత్రాన ఆ షో నెం 1 గా నిలవదు, అందులో ప్రేక్షకులను ఆకట్టుకునే చక్కని కంటెంట్ ఉంటే తప్ప. రానాకు అతిధులతో ఉన్న సాన్నిహిత్యం, వారితో వేసే ఛలోక్తులు, ఆత్మీయ సంభాషణలతో ఈ షో అత్యధికంగా 10.3 టి.ఆర్.పి రేటింగ్స్ తో ఎదురులేకుండా దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు తొమ్మిది ఎపిసోడ్లు దిగ్విజయంగా  పూర్తిచేసుకుని నందమూరి బాలకృష్ణ  మరో ఎపిసోడ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ తో ముందుకు రాబోతున్నది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తొలిసారిగా బుల్లితెరపై స్టార్ మాలో అందిస్తున్న అత్యంత భారీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మొదట్లో చాలా డల్ గా నడిచినా క్రమంగా టీ.ఆర్.పీ రేటింగ్ లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

పార్టిసిపెంట్ల విషయంలో ముందు ప్రేక్షకుల్లో నిరాశ వ్యక్తమైనా.. వారాంతాల్లో మినహాయిస్తే పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని.. హౌస్ మేట్స్ అనుకున్నంత స్థాయిలో ఎంటర్టైన్ చేయట్లేదని విమర్శలు వ్యక్తమైనా.. షో రేటింగ్స్ అయితే పడిపోలేదు. కానీ తాజాగా బిగ్ బాస్‌ని బీట్ చేస్తు రానా నెం 1 యారి షో తెలుగులో  టాప్‌ పొజిషన్ దక్కించుకుంది

- Advertisement -