నవీన్ యాదవ్ ఘనవిజయం

8
- Advertisement -

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు నవీన్ యాదవ్.

ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలో కొనసాగారు నవీన్ యాదవ్. ఏ ఒక్క రౌండ్‌లోనూ ఆధిక్యం దక్కించుకోలేకపోయారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.

మాగంటి సునీతపై 24వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యం రౌండ్‌ రౌండ్‌కు పెరిగింది. నవీన్ యాదవ్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. గాంధీ భవన్ వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ సంబురాల్లో పలువురు నేతలు, మంత్రులు పాల్గొన్నారు.

Also Read:మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యం

- Advertisement -