ప్రముఖ మహిళా దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల మనవడు , సినీ హీరో డాక్టర్ నరేష్ విజయ కృష్ణ కుమారుడు నవీన్ విజయ కృష్ణ తెలంగాణ లోని వనపర్తి జిల్లా అమరచింత గ్రామం లోని హజ్రత్ సయ్యద్ రాజా వలి దర్గా షరీఫ్ 406 ఉరుసు ఉత్సవాలలో పాల్గొనటానికి అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ ఆహ్వానం మేరకు ఆదివారం రావా వాలి దర్గా ను దర్శించి చాదర్ , పూలమాలలు సమర్పంచి మొక్కును తీర్చు కున్నారు . ఈ సందర్బంగా కమిటీ సభ్యులు తనను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ , తాను నటించిన నందిని నర్సింగ్ హోమ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదిరించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ సంవత్సరం 2 చిత్రాలలో నటించడానికి అంగీకరిచినట్టుగా తెలియచేశారు. తదుపరి చిత్రం లో ఖాదర్ ఘోరీ విలన్ గా నటిస్తునట్టు షూటింగ్ ను జూరాల ప్రాజెక్ట్ వద్ద కొంత భాగం ఉంటుందని పేర్కొన్నారు. దర్గా ను దర్శించుకోవటం తనకు ఆత్మ సంతృప్తి కలిగించింది అని ఆశా భావం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో ఖాజా పాషా , రఫీ , మొహమ్మద్ సమద్ సయ్యద్, కలాం పాష, సత్తార్ బేగ్, ఇంతియాజ్, మోహిన్, తక్కి, జిలాని, అబుద్దులా, రఫియొద్దీన్, అక్బర్ ఖాజా హుస్సేన్, మైబు, మల్లికార్జున్, యాదయ్య, లక్ష్మణ్, గున్నా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.